ముంబయి బాంద్రా(Bandra)లో దారుణ ఘటన జరిగింది. తాము ఆర్డర్ చేసిన చికెన్ కూరలో ఎలుక అవశేషాలు కనిపించాయంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆదివారం రాత్రి నగరంలోని ఓ హోటల్(Bandra Eatery)లో చికెన్ కూర, మటన్ థాలీని ఆర్డర్ చేశారు. వాటిని తింటుండగా.. ఆహారంలో వారికి ఏదో తేడా కనిపించింది. దానిని గమనించగా అది ఎలుక అవశేషమని గుర్తించారు. దీనిపై హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాధానం వచ్చిందన్నారు.
ఆ తర్వాత వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరీక్ష నిమిత్తం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA)కు పంపామని మేనేజర్, కుక్‌ను అరెస్టు చేశాం’ అని బాంద్రా ఇన్స్పెక్టర్ తెలిపారు.ఈ ఘటనపై మేనేజర్ స్పందిస్తూ.. తాము 22 ఏళ్లుగా హోటల్ నడుపుతున్నామని, ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని చెప్పారు. ‘వారికి ఆహారం వడ్డించిన సమయంలో నేను హోటల్(Hotel)లో లేను. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడికి వచ్చాను. వారిద్దరు బాగా తాగి ఉన్నారు. వారి చేతిలో మద్యం బాటిళ్లు ఉన్నాయని మా సిబ్బంది చెప్పారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా బాంద్రా పోలీసులు రెస్టారెంట్ మేనేజర్(Restaurant Manager), చెఫ్ వివియన్ అల్బర్ట్ శికవర్, చికెన్ సప్లయర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.