»Sensational Judgment Of The American Court Rs 9900 Crores To The Victim Woman
American court సంచలన తీర్పు.. బాధిత మహిళకు రూ.9900 కోట్లు
మాజీ భార్యని మానసికంగా వేధించినందుకు 200 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1600కోట్లు)తోపాటు నష్టపరిహారం చెల్లించాలని అమెరికా కోర్టు ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.
అమెరికాకు చెందిన ఓ మహిళ (మొదటి పేరు డీఎల్ అని మాత్రమే పేర్కొంది) మార్క్వెస్ జమాల్ జాక్సన్ (Jamal Jackson) అనే వ్యక్తితో 2016 నుంచి కలిసి జీవించారు. షికాగో(Chicago)లో కొంతకాలం గడిపిన తర్వాత అక్టోబర్ 2021న పరస్పర అంగీకారంతో వారిద్దరూ విడిపోయారు (Breakup). అనంతరం అతడి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఓ మహిళపై మాజీ భాగస్వామి లైంగిక వేధింపులకు (abuse) పాల్పడిన ఘటన అమెరికాలో జరిగింది. భాగస్వామితో బ్రేక్ప్ తర్వాత ఆమె ప్రైవేటు ఫొటోలను ఆన్లైన్లో పెట్టి అవమానాలకు (Revenge ) గురిచేయడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె తొలుత పోలీసులకు కంప్లైంట్ చేసింది.
అక్కడ సరైన న్యాయం జరగలేదని భావించి.. సివిల్ కోర్టు(Civil Court)ను ఆశ్రయించారు. ఈ సివిల్ దావాపై విచారణ పూర్తిచేసిన ప్రత్యేక న్యాయమూర్తుల బృందం (Jury).. బాధిత మహిళకు 1.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.9900 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. మాజీ భార్యని అవమానించడమే లక్ష్యంగా పెట్టుకున్న అతడు.. గతంలో ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను (intimate pictures) శృంగార సైట్లలో పెట్టాడు. దీంతోపాటు ఆమె ఇంట్లోని సీసీ కెమెరాలు, మొబైల్, ఈ-మెయిల్ నుంచి పర్సనల్ ఫొటోలను సేకరించి.. ఆమె అనుమతి లేకుండా సోషల్ మీడియా(Social media)లో నకిలీ ఖాతాలను సృష్టించి అందులో పోస్టు చేశాడు. ఆ ఫొటోల లింకులను అమ్మాయి స్నేహితులు, కుటుంబ సభ్యులకూ పంపించ సాగాడు.
వాటిని ఇంటర్నెట్ నుంచి తీసివేయడానికి ప్రయత్నించినా.. అందుకు మీ జీవితం సరిపోదు’ అంటూ మాజీ భాగస్వామికి మెసేజ్లు పంపించేవాడు.అమెరికాలో అనేక రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న చట్టాల ప్రకారం, ఓ వ్యక్తి అంగీకారం లేకుండా వారి వ్యక్తిగత (మాజీ భాగస్వామి) ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్లో షేర్ చేయడం నేరం. వ్యక్తిత్వానికి హాని కలిగించే ఉద్దేశంతో చేసే ఇటువంటి చర్యలను ‘రివెంజ్ పోర్న్’గా వ్యవహరిస్తారు. అమెరికా(America)లో ఈ తరహా సెటిల్మెంట్లలో భాగంగా భారీ మొత్తాలను చెల్లించిన దాఖలాలు అనేకం ఉన్నాయి. తాజా దావా టెక్సాస్ కోర్టు పరిధిలో జరిగింది.