సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అత్యుత్తమ ఆల్టైమ్ టీ20 క్రికెటలర్ ఎవరన్న ప్రశ్నకు అతడు సమాధానం ఇచ్చారు. అత్యుత్తమ టీ20 ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా అని తెలిపాడు. నిలకడైన ఆటకు అతడు మారుపేరని.. ముఖ్యంగా 20 ఓవర్ల ఆటలో ఏ సమయంలోనైనా.. ఎంత ఒత్తిడిలో ఉన్నా అద్భుతాలు చేయగలడని ప్రశంసించాడు.