RR: అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆపబోమని దళిత స్త్రీ శక్తి వ్యవస్థాపకులు ఝాన్సీ అన్నారు. ఇటీవల దాడికి గురైన దళిత జర్నలిస్టు శేఖర్ నివాసాన్ని ఆమె సందర్శించారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. చేవెళ్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిత్యం దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, వాటిని అరికట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు.