Youtube: ఇప్పుడు అంతా ఆన్ లైన్.. గూగుల్‌లో టెక్ట్స్ సర్చ్ చేసి సమాచారం తీసుకుంటున్నారు. వీడియో రూపంలో అయితే యూట్యూబ్‌లోకి (Youtube) వెళుతున్నారు. నెట్ కూడా ఎక్కువ ఉండటంతో పదే పదే చూస్తున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి, పండు ముసలి వరకు మొబైల్లో నిమగ్నం అవుతున్నారు. యూట్యూబ్‌లో (Youtube) నచ్చని కంటెంట్ వస్తూ ఉంటది. దానిని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకుందాం. పదండి.
ఇలా డిలీట్ చేయండి
యూట్యూబ్‌లో (Youtube) వచ్చే ఫీడ్ మనం చేసే సెర్చ్‌ను బట్టే వస్తోంది. సెర్చ్ హిస్టరీ, వాచ్ హిస్టరీ ఆధారంగా కనిపిస్తోంది. మొబైల్, లేదంటే స్మార్ట్ టీవీని ఒకరే వాడితే ఇబ్బంది ఉండదు. ఇంట్లో భార్య, భర్త, పిల్లలు వాడటంతో.. ఒక్కొక్కరీ అభిరుచి మేరకు ఫీడ్ కనిపిస్తోంది. పిల్లలు వారికి నచ్చిన షార్ట్స్, లేదంటే స్లైమ్కి సంబంధించిన ఫీడ్ చూస్తుంటారు. ఇక భర్త అయితే ఎంటర్ టైన్మెంట్ కోసం మూవీ ట్రైలర్, టీజర్ లేదంటే సాంగ్స్ చూస్తుంటారు. భార్య అయితే వంటింటి చిట్కాలు, వంటలు, టూర్స్ అండ్ ట్రావెల్‌కి సంబంధించిన సమాచారం చూస్తుంటారు. సో.. రకరకాల డేటా చూడటంతో అన్నీ కలిపి మొబైల్/ టీవీలో కనిపిస్తాయి.
డొంట్ రికమండ్
ఆ కంటెంట్ మీకు నచ్చకుంటే పర్సనల్ మొబైల్లో వీడియో (video) పక్కన ఉండే 3 డాట్స్ మెనూపై క్లిక్ చేయాలి. డొంట్ రికమండ్ చానెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ ఛానల్‌కి సంబంధించిన కంటెంట్ ఇక ఫీడ్‌లో కనిపించదు. లేదంటే నాట్ ఇంట్రెస్టెడ్ ఆప్షన్ వినియోగిస్తే ఇకపై అలాంటి వీడియోలు యూట్యూబ్ (Youtube) రికమండ్ చేయదు. అలా కాదు అంటే చివరకు ఇలా ట్రై చేయండి.
సెర్చ్ హిస్టరీ
ఏదైనా ఫీడ్ చూస్తే అలాంటి వీడియోలే కనిపిస్తాయి. సో.. వాచ్ హిస్టరీ నుంచి సంబంధిత వీడియో డిలీట్ చేస్తే ఇకపై అలాంటి వీడియోలను యూట్యూబ్ (Youtube) చూపించదు. సెర్చ్ హిస్టరీలో ఆ టాపిక్ తొలగించడం ద్వారా ఫీడ్ నియంత్రించొచ్చు. సంబంధిత వీడియో సెర్చ్ చేసే ముందే ఆ తరహా వీడియోలు మళ్లీ కనిపించకుండా హిస్టరీ పాజ్ చేయొచ్చు. ఇప్పటివరకు చూసిన వాచ్ హిస్టరీ, సెర్చ్ హిస్టరీ మొత్తం తొలగించండి. హిస్టరీలో క్లియర్ హిస్టరీ ఆప్షన్ వినియోగించి.. తొలగించాలి. ఆ ఫీడ్‌లో ఉన్న కొన్ని వీడియోలను తిరిగి చూడాలని అనుకుంటే వాచ్ లేటర్ ఆప్షన్ వినియోగించాలి. ఇలా మీకు నచ్చిన ఫీడ్ సెట్ చేసుకోవచ్చు. ఒక్కరే మొబైల్ వాడితే ఫర్లేదు. ఇద్దరు, ముగ్గురు కూడా యూట్యూబ్ చూస్తే ఇబ్బందులు తప్పవు.