కూల్ బీర్ కావాలని అడిగి గొడవకు దిగాడు హరిబాబు అనే వ్యక్తి. వైన్ సిబ్బంది దాడి చేయడంతో అతని తల పగిలింది. వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
Cool Beer: ఇండిపెండెన్స్ డే (Independence day) ఈ రోజు.. మద్యం, మాంసం విక్రయాలు బంద్.. చాటుగా అమ్ముతుంటారు. పోలీసులు కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తారు. ఏపీలో గల కాకినాడలో (kakinada) ఓ యువకుడు గొడవ పడ్డాడు. వైన్ సిబ్బంది చేతిలో దెబ్బలు తిని.. తల పగలగొట్టుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. మీరు కూడా ఆ వీడియోను ఓసారి చూడండి.
రాజాం (rajam) మండలం రాజీపేట ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద గొడవ జరిగింది. ఆబోతుల హరిబాబు (haribabu) అనే వ్యక్తి వైన్ షాపు వద్దకు వచ్చాడు. బీర్ కావాలని అడిగాడు. కూల్ బీర్ లేవా అని అడగగా.. వైన్ షాపులో పనిచేసే సిబ్బందికి అతనికి మధ్య గొడవ జరిగింది. బయటకు వచ్చిన సిబ్బంది- హరిబాబు (hari babu) ఒకరిపై ఒకరు తోసుకున్నారు. పిడిగుద్దులు గుప్పించారు.
కూల్ బీర్ కోసం తల పగలకొట్టుకున్నారు
కాకినాడ – రాజాం మండలంలోని రాజిపేట ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఆబోతుల హరిబాబు అనే వ్యక్తి బీర్లు కూలింగ్ లేవా అంటూ అడగగా.. వైన్ షాప్ సిబ్బందికి, అతనికి మధ్య గొడవ జరిగి కూల్ బీర్ అడిగిన హరిబాబు తల పగిలింది. pic.twitter.com/Zh1S5KXEBs
గొడవలో కూల్ బీర్ (Cool Beer) అడిగిన హరిబాబు గాయపడ్డాడు. వైన్ సిబ్బంది దాడి చేయడంతో అతని తల పగిలింది. తలకు కట్టు కట్టుకొని కనిపించాడు. ఉన్న బీర్ తీసుకోవడమో.. లేదంటే ఇంట్లో పెట్టుకోవడమో చేస్తే ఫర్లేదు.. బీర్ (beer) కోసం పొట్లాటకు దిగి.. చివరకు దెబ్బలు తిన్నాడు. ఆ వీడియో చూసి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.