»Chidambaram To Head Congress Manifesto Committee For 2024 Polls
Congress Manifesto Committee చైర్మన్గా చిదంబరం, 16 మంది సభ్యులు
2024 లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతోంది. పీ చిదంబరం నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీని ప్రకటించింది. 16 మంది సభ్యులను కూడా నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటన చేశారు.
Chidambaram To Head Congress Manifesto Committee For 2024 Polls
Congress Manifesto Committee: లోక్ సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ (congress) దృష్టిసారించింది. కర్ణాటక ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల్లో జయభేరి మోగించడంతో.. లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ చేసింది. ఇప్పటినుంచే కార్యాచరణ రూపొందిస్తోంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాలని ఊబలాట పడుతోంది.
అప్పుడే మేనిఫెస్టో కమిటీని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. మేనిఫెస్టో రూపకల్పన బాధ్యతను సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరంకు అప్పగించారు. అతని నేతృత్వంలో 16 మంది సభ్యులు ఉంటారు. వారిలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉన్నారు.
మాజీ కేంద్రమంత్రులు ఆనంద్ శర్మ, జైరాం రమేశ్, శశిథరూర్, ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి, లోక్ సభలో పార్టీ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగొయ్, మణిపూర్ మాజీ డిప్యూటీ సీఎం గైఖాం గమ్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలని.. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది. అందుకోసం ఇప్పటినుంచే కార్యాచరణ రూపొందించి, అమలు చేస్తున్నారు.