ప్రకాశం: ఒంగోలులోని 7వ డివిజన్లో రూ.75 లక్షలతో సీసీ రోడ్లు, 8వ డివిజన్లో రూ.13 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ప్రహరీ గోడను ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మంగళవారం ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని, ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎంపీ పేర్కొన్నారు.