MDCL: ఉప్పల్ గణేష్ నగర్‌కు చెందిన రమేష్ అనే వ్యక్తిని స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు వస్తాయని నమ్మించి సైబర్ నేరగాళ్లు రూ. 35,000 మోసం చేశారు. మొదట తక్కువ పెట్టుబడితో లాభాలు చూపించి, తర్వాత మరింత డబ్బు పెట్టించాలని ఒత్తిడి చేశారు. అనుమానం రావడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.