దివంగత నటి శ్రీదేవికి చెందిన 4.7 ఎకరాల స్థలంపై వివాదం మద్రాస్ హైకోర్టుకు చేరింది. 1988లో ఆమె కొన్న ఈ ఆస్తిపై కొందరు వేసిన దావాను బోనీ కపూర్, జాన్వీ, ఖుషి కపూర్ సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ తమిళ్సెల్వి, జిల్లా కోర్టు చర్యలపై మార్చి 26 వరకు స్టే విధించారు. తమ వద్ద పక్కా పత్రాలు ఉన్నాయని, ఇది కావాలని సృష్టించిన వివాదమని కపూర్ కుటుంబం పేర్కొంది.