NLG: మునుగోడు మండలం ఎలగలగూడం గ్రామంలో ఓ రైతు అప్పులు చేసి సాగు చేసిన వరి పంట నీటి కొరతతో ఎండిపోతోంది. నాటు వేసిన పంట వడ్లు కాసే సమయంలోనే నీళ్లు లేక నాశనమవడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పశువులను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. “పొలం ఎండిపోతుందా… రైతన్న గుండె ఆగిపోతుందా” అనే పరిస్థితి నెలకొంది.