»Us Man Bought An Almirah For Less Than 500 Dollars And Found Safe With Over 7 Million Dollars Cash Inside
Almirah: అదృష్టమంటే ఇతనిదే.. పాత అల్మారా కొన్నాడు..కోట్ల నిధి కైవసం చేసుకున్నాడు
అమెరికాలో కూడా ఇలాంటి కేసు ఒకటి వచ్చింది. ఈ విషయం ప్రజలు నమ్మడం కష్టంగా ఉంది. వాస్తవానికి, తన భర్త పాత వార్డ్రోబ్ను కొన్నాడని, అందులోంచి కోట్ల విలువైన 'నిధి' రహస్యంగా బయటకు వచ్చిందని.. దానిని చూసి ఆమె ఎగిరి గంతేశానని ఓ మహిళ చెప్పింది.
Almirah: ధనవంతులు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఎవరు ధనవంతులు కావాలో ఆ దేవుడే రాస్తాడు. కొందరు తొలి రోజుల్లో బాగా కష్ట పడినా.. తర్వాత తర్వాత కుబేరులుగా మారతారు. మరికొందరికి మాత్రం అదృష్టం తలుపుతట్టి రాత్రికి రాత్రే వేల కోట్లకు యజమానులు అవుతారు. కొందరికీ బంపర్ లాటరీ తగలొచ్చు. మరికొందరికీ నిధి దొరకొచ్చు. అమెరికాలో కూడా ఇలాంటి కేసు ఒకటి వచ్చింది. ఈ విషయం ప్రజలు నమ్మడం కష్టంగా ఉంది. వాస్తవానికి, తన భర్త పాత వార్డ్రోబ్ను కొన్నాడని, అందులోంచి కోట్ల విలువైన ‘నిధి’ రహస్యంగా బయటకు వచ్చిందని.. దానిని చూసి ఆమె ఎగిరి గంతేశానని ఓ మహిళ చెప్పింది.
LadyBible అనే వెబ్సైట్ నివేదిక ప్రకారం.. డాన్ డాట్సన్, అతని భార్య లారా సోషల్ మీడియాలో ఒక క్లిప్‌ను పంచుకున్నారు. ఒక మహిళ తమ వద్దకు వచ్చిందని, ఎవరూ ఆశ్చర్యపోని కథను చెప్పారు. తన భర్త పాత స్టోరేజీ యూనిట్‌ని అంటే వార్డ్‌రోబ్‌ని 500డాలర్లు అంటే దాదాపు 41 వేల రూపాయలకు కొన్నాడని.. దాని లోపల డబ్బుతో కూడిన ఖజానా ఉందని ఆమె చెప్పింది. అల్మారా తెరవడానికి తాను పిలిచిన మొదటి వ్యక్తి దానిని తెరవలేకపోయాడని మహిళ చెప్పింది. ఖజానా తెరవడానికి మరొక వ్యక్తిని పిలవవలసి వచ్చింది. ఆ సేఫ్‌ని ఓపెన్ చేయగానే అందులో నుంచి 7.5 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.62 కోట్ల నగదు బయటకు వచ్చింది.
నమ్మశక్యం కాని నగదు దొరికిన వెంటనే మహిళ భర్తను న్యాయవాది సంప్రదించారని డాట్సన్స్ తెలిపింది. ఖజానాను తనకు అప్పగించాలని ప్రతిఫలంగా 6 లక్షల డాలర్లు అంటే దాదాపు 5 కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకోవాలని కోరగా వారు నిరాకరించారు. దీని తర్వాత అతనికి మరింత పెద్ద ప్రైజ్ మనీ ఆఫర్ చేయబడింది. దానిని అతను అంగీకరించాడు. నిజానికి రెండోసారి ఆ సేఫ్కి అసలు ఓనర్ అయిన వ్యక్తి లాయర్ నుంచి కాల్ వచ్చింది. తొలుత రూ.5 కోట్లు కూడా ఆఫర్ చేసిన ఆయన ఆ తర్వాత దాన్ని రెట్టింపు చేసి రూ.10 కోట్లకు పెంచారు. ఇలా ఏకంగా కోట్లకు యజమాని అయ్యాడు.