»Bomb Threat To Eiffel Tower Police Evacuated Tourists
Eiffel Tower: ఈఫిల్ టవర్‌కు బాంబు బెదిరింపు.. టూరిస్ట్‌లను ఖాళీ చేయించిన పోలీసులు
ఈఫిల్ టవర్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సందర్శకులను అనుమతించడం లేదు. బాంబు స్వ్కాడ్‌తో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈఫిల్ టవర్(Eiffel Tower) లో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్ వచ్చింది. ఫ్రాన్స్ (France) రాజధాని పారిస్‌లోని ప్రసిద్ధ సందర్శనీయమైన ఈ టవర్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మూడు అంతస్తుల్లో ఉన్న సందర్శకులను ఫ్రాన్స్ పోలీసులు ఖాళీ చేయించారు. టవర్‌పై ఉన్న రెస్టారెంట్‌లోని వారిని కూడా అక్కడి నుంచి ఖాళీ చేసి అక్కడి నుంచి పంపించేశారు.
ఈఫిల్ టవర్ లో బాంబు స్క్వాడ్ (Bomb squad), పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపు కాల్ రావడంతో శనివారం మధ్యాహ్నం నుంచి సందర్శకులను పోలీసులు అనుమతించలేదు. ప్రపంచ ప్రసిద్ధ కట్టడాల్లో ప్రసిద్ధిగాంచిన ఈఫిల్ టవర్ నిర్మాణ పనులు 1887లో ప్రారంభం అయ్యాయి. 1889 మార్చి 31వ తేదిన దాని నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆ ఏడాదిలోనే జరిగిన వరల్డ్ ఫెయిర్‌లో సుమారుగా 20 లక్షల మంది ఈఫిల్ టవర్‌ను సందర్శించారు. గత ఏడాదిలో సుమారు 62 లక్షల మంది ఈఫిల్ టవర్‌ను సందర్శించారు.
బాంబు బెదిరింపు కాల్ వచ్చిన తరుణంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈఫిల్ టవర్‌కు స్థానికంగా ఉండే ప్రాంతాలన్నింటిలో తనిఖీలు చేపట్టారు. సీసీ కెమెరాల నిఘాను పరిశీలించారు. అది ఫేక్ కాల్ (Fake Call) అని తెలియడంతో పలువురు ఊపిరి పీల్చుకున్నారు. సందర్శకులను మాత్రం అనుమతించడం లేదని ఫ్రాన్స్ (France) మీడియా వెల్లడించింది.