AP: చిత్తూరులోని గంగవరంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. పోలీస్ జీపును దొంగతనం చేసిన నిందితుడు.. అదే జీపుతో పలువురిని తీవ్రంగా గాయపరిచాడు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా ఒక ఆటో, మరో మూడు వాహనాలను ఢీకొట్టాడు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.