»Meteorological Department Warning Rains In Telugu States For A Week
Rain Alert: వాతావరణశాఖ హెచ్చరిక.. తెలుగు రాష్ట్రాల్లో వారం పాటు వర్షాలు
తెలుగురాష్ట్రాలను వర్షాలు వదలడం లేదు. మరో వారం రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) మరో వారం రోజుల పాటు వర్షాలు(Rain) కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో దేశవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ(IMD) తెలిపింది. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో శనివారం ఉదయం చాలా ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయని, ఆగస్టు 15వ తేది నుంచి తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, కడప, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ (weather department) వెల్లడించింది. రాయలసీమలో మాత్రం పొడి వాతావరణమే ఉంటుందని తెలిపింది. యానాంలో తేలికపాటి చిలుజల్లులు పడే అవకాశం ఉందని, అయితే సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు(Temperature) నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తెలంగాణలో గాలిలో వేడి, తేమ కారణంగా వాతావరణం అసౌకర్యంగా ఉంటుందని, గంటలకు 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ(weather department) తెలిపింది. ఉపరితల ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటుగా గుజరాత్, విదర్భ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, బెంగాల్, ఒడిశా, కొంకణ్, గోవా, కోస్టల్ కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.