Five arrested in Andhra Pradesh CMO digital signature tampering case
AP CMO: ఆంధ్ర ప్రదేశ్(Andra Pradesh) ముఖ్యమంత్రి కార్యాలయంలో డిజిటల్ సంతకాల(Digital Signature) దుర్వినియోగం జరిగిని విషయం తెలిసిందే. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సైబర్ క్రైమ్ సీఐడీ(Cybercrime CID) ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. ఏపీలోని కొందరు కార్యదర్శుల డిజిటల్ సంతకాలను నిందితులు దుర్వినియోగం(Misuse) చేసి సీఎంపీలు జారీ చేశారని పేర్కొన్నారు. సీఎంవోలోని రేవు ముత్యాలరాజు, ధనుంజయ్‌రెడ్డి, సీఎస్ జవహర్‌రెడ్డి పేషీల్లో పని చేస్తున్న వాళ్లే ఈ నేరానికి పాల్పడ్డారని చెప్పారు.
వీరి డిజిటల్ సంతకాన్ని ఉపయోగించుకొని ఒక్కో ఫైల్‌కు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేశారు. ఏప్రిల్ నుంచి 3 నెలల్లో 66 సీఎంపీలు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో నిందితులు రూ.15 లక్షల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. అయితే ఏ ఫైలుకూ తుది ఆమోదం రాలేదు అని వివరించారు. డిజిటల్ సంతకాలను ట్యాంపరింగ్ చేసినట్లు తొలుత సీఎం పేషీలోని కార్యదర్శి భరత్ గుప్తా గుర్తించారని తెలిపారు. ఈ వ్యవహారంలో తదుపరి విచారణ కొనసాగుతోందని చెప్పారు.
చదవండి:Jeff bezos: కాబోయే భార్యకు రూ.560 కోట్ల గిఫ్ట్ ఇచ్చిన వ్యాపారవేత్త!