RR: రంజాన్ మాసం సందర్భంగా ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులకు నిన్న సాయంత్రం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. మతసామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులు నిలుస్తాయని.. కుల, మత భేదాలు లేకుండా ప్రతిఒక్కరూ ఇఫ్తార్ విందులో పాల్గొంటారన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.