వివాహేతర సంబంధాలు అనేక అనర్థాలకు దారితీస్తున్నాయి. పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. తాజాగా బావ (Brother in law) తో వివాహేతర సంబంధం పెట్టుకున్నదని చెల్లెలి (Younger sister) ని అఘాయిత్యానికి పాల్పడింది. తన భర్తతో చెల్లెలికి వివాహేతర సంబంధం ఉందని ఆమె అక్క అనుమానపడింది. అంతే ఆమెను మట్టుబెట్టడానికి ప్రయత్నించింది. కంట్రీ మేడ్ పిస్టల్‌తో ఆమెపై కాల్పులు జరిపింది.తోడబుట్టిన చెల్లిపై అక్క దారుణానికి ఒడి గట్టింది. తీవ్రగాయాల పాలైన చెల్లెలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఢిల్లీ(Delhi)లో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. ఢిల్లీ శాస్త్రి పార్క్ బులంద్ మసీదు (Buland Masjid) సమీపంలో నివాసం ఉంటున్న సుమైలపై ఆమె అక్క సోను ఫైర్ చేసింది. తన భర్తతో సుమైల వివాహేతర బంధం కొనసాగిస్తోందనే అనుమానంతో ఆమెపై దాడి చేసింది. పిస్టల్ (Pistol) బేస్‌తో సోను ఆమె తలపై బాదడంతో సుమైల ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సుమైల పోలీసులూ (Police)కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యాయత్నం ఆయుధాల చట్టం(Arms Act)తో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి సోనును అరెస్టు చేశారు.