MDK: కొత్తగా పట్టా పాస్ పుస్తకం కలిగిన రైతులు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవాలని రామాయంపేట ఇంఛార్జ్ వ్యవసాయ అధికారి భరత్ కుమార్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సహాయం కింద పంపిణీ చేసే రైతు భరోసా కోసం ఇటీవల కొత్తగా భూమి కొనుగోలు చేసిన రైతులు పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలను అందజేయాలని సూచించారు.