»Vanapartizilla Son In Law Set Fire To His Mother In Laws House Because His Wife Did Not Come To His House
Viral news: భార్య కాపురానికి రావట్లేదని..అల్లుడి దారుణం
భార్యభర్తల గొడవలు మాములే అని అంటారు. కానీ క్షణికావేశంలో జరిగే నష్టాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. తన భార్య కాపురానికి రావట్లేదని ఓ భర్త తన అత్తగారింటికి నిప్పు పెట్టాడు. తర్వాత ఏమైందో మీరు చూసేయండి మరి.
Vanapartizilla, son-in-law set fire to his mother-in-law's house because his wife did not come to his house
House on fire: భార్యా భర్తల(Wife And Husband) మధ్య గొడవలు సాధారణమేనని అందరికి తెలుసు. కోపం తగ్గాక ఓ 10 నిమిషాలు కూర్చుని మాట్లాడితే అన్ని సమస్యలు సర్ధుకుంటాయని కూడా తెలుసు. అయినా సరే కొందరు విచక్షణ కోల్పోతారు. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో తెలిసేలోపే జరిగే నష్టం జరిగిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న తగదాలే పెద్దగా మారి చివరికి విడిపోయేంత వరకు దారితీస్తాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాల మీదకు వస్తాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి తెలంగాణ(Telangana) రాష్ట్రం, వనపర్తి(Wanaparti) జిల్లాలోనూ చోటుచేసుకుంది. భార్య భర్తల నడుమ గొడవతో అత్తింటికి నిప్పంటించాడు.
వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురం మండలంలో చిన్న భద్రయ్య, మణెమ్మ దంపతుల కుమార్తె లక్ష్మి. తనను అదే గ్రామానికి చెందిన శివయ్యకు ఇచ్చి 14 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. అయితే గత మూడేళ్లుగా శివయ్య అనారోగ్యంతో బాధపడుతుండడంతో దంపతుల మధ్య గొడవలు జరిగాయి. దీంతో భార్య పుట్టింటికి వెళ్లింది. గత కొంత కాలంగా ఆమె పుట్టింటిలోనే ఉంటోంది. భార్యను కాపురానికి పంపేందుకు శివయ్య అత్తమామల వద్దకు వచ్చి తరచూ గొడవ పడేవాడు. లక్ష్మీ మాత్రం కాపురానికి రానని తేల్చి చెప్పింది.
తల్లిదండ్రులు కూడా తమ కుమార్తె వైపే మాట్లాడారు. దీంతో శివయ్యకు కోపం వచ్చింది. అర్ధరాత్రి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు(House on fire). ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. శివయ్యపై భార్య లక్ష్మి, అత్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.