»Do Not Come To The Shamshabad Airport More Than Three People Police Advice
Shamshabad: ఎయిర్ పోర్టుకు ముగ్గిరి కంటే ఎక్కువ రావొద్దు..పోలీసుల సూచన
చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు గత రెండు, మూడు రోజల నుంచి శంషాబాద్ విమానాశ్రాయానికి(shamshabad airport) పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఒక్కో విద్యార్థి కోసం 10 నుంచి 50 మంది దాకా వస్తున్నారని దీంతో ఇతర ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Do not come to the shamshabad airport more than three people police advice
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు(shamshabad airport)కు గత రెండు మూడు రోజుల నుంచి స్టడీస్ కోసం విదేశాలకు వెళ్లే వెళ్లే విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అంతేకాదు వారి కుటుంబ సభ్యులు కూడా ఒక్కరి తరఫును 10 నుంచి 60 మంది దాకా వస్తున్నారని ఎయిర్ పోర్టు అధికారులు(officers) చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టులో రద్దీ ఎక్కువగా ఏర్పడి ఇతర ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతుందని అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో ఫారెన్ వెళ్లే విద్యార్థుల తరఫున ముగ్గురు లేదా నలుగురు మాత్రమే రావాలని అధికారులు స్పష్టం చేశారు. మరికొంత మంది కోసం అయితే 50 నుంచి 60 మంది సందర్శకులు పెద్ద సంఖ్యలో వాహనాలతో రావడం ద్వారా ర్యాంపులలో పెద్ద ఎత్తున రద్దీగా మారుతుందని అధికారులు చెబుతున్నారు.
ప్రతి రోజు ఎయిర్ పోర్టుకు 80 వేల మందికిపైగా ప్రయాణికులు వస్తున్నారని ఈ సందర్భంగా శంషాబాద్ డీసీపీ(DCP) రామ్ కుమార్ తెలిపారు. అంతేకాదు అనేక మంది రావడం వల్ల పార్కింగ్ సమస్య కూడా తలెత్తుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉన్న నేపథ్యంలో ఎక్కువగా జనాలు రాకుడదని, ప్రతి విద్యార్థి తరఫున కేవలం ముగ్గురు లేదా నలుగురు మాత్రమే రావాలని స్పష్టం చేశారు. ఇలా అనేక మంది రావడం వల్ల ఇతర ప్రయాణీకులకు అసౌకర్యాన్ని కలిగిస్తుందని సూచించారు.