»A Woman In Nandigama Gave Birth To Triplets After 20 Years Died During Treatment
Birth: 20 ఏళ్ల తరువాత ముగ్గిరికి జన్మనిచ్చింది..అంతలోనే
అమ్మ అనిపించుకోవడం ప్రతి మహిళకు ఉండే బలమైన కోరిక. అప్పుడే తన జీవితం సంపూర్ణంగా ఉంటుందని భావిస్తుంది. అలా 20 సంవత్సరాల నిరీక్షణ తరువాత బిడ్డలకు జన్మనిచ్చి తల్లి వారిని చూడకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది.
A woman in Nandigama gave birth to triplets after 20 years. Died during treatment.
Giving Birth: వివాహం(Marriage) అయిన ఇరువై సంవత్సరాల తరువాత ఒక మహిళా తల్లి కాబోతుందన్న వార్త ఆ కుటుంబంలో సంతోషాన్ని నింపింది. అంతలోనే ఆ సంతోషం ఆవిరైపోయింది. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన(Gave birth to three children) ఆ తల్లి తన బిడ్డలతో ముద్దూ మురిపెం తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. కనీసం వారి మొఖాలన్నా చూడకుండా కన్నుమూసింది. పసి కూనలు తల్లి స్పర్శకు కూడా నోచుకోలేదని.. బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. దీంతో వారి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఎన్టీఆర్ జిల్లా నందిగామ(Nandigama ) మండలం మాగల్లు గ్రామానికి చెందిన షేక్ నజీరా(35)కు పల్లగిరికి చెందిన ఖాసింతో ఇరవై ఏళ్ల క్రితం నిఖా అయింది. వారికి సంతానం కలుగలేదు. దానికోసం వారు చేయని ప్రార్థనలు లేవు. మొక్కని దర్గాలు లేవు. బిడ్డల మీద ప్రేమతో ఆసుపత్రులు చుట్టు తిరుగుతూనే ఉన్నారు. అమ్మ అనిపించుకోవాలనే తన కొరిక బలంతో నజీరా గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు. ఇంట్లో తిరిగే బుడిబుడి అడుగుల కోసం కలలుగన్నారు. పది రోజుల క్రితం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు.
మొత్తం ముగ్గురు పిల్లలు జన్మించారు. వీరిలో ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నారు. అయితే నజీరాకు రక్తం తక్కువగా ఉండటంతో రక్తం ఎక్కించారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే మంగళవారం రాత్రి ఆమె కన్నుమూసింది. బుధవారం ఆమె మృతదేహాన్ని పల్లగిరి గ్రామానికి తీసుకొచ్చి ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపించారు. భర్త, బంధువుల ఆర్తనాదాలతో గ్రామంలో విషాదం నెలకొంది. ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్న ఖాసిం తన ఆర్థిక స్థోమతకు మించి ఖర్చు చేసినా భార్యను కాపాడుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పసిపిల్లలకు ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం ఎలా ఉంటుందో అని ఖాసిం విలవిల్లాడుతున్నాడు.