SKLM: జిల్లాలో గత రెండు రోజులుగా చలి తీవ్రత అధికమైంది. దీంతో వేకువజాము, రాత్రి సమయాల్లో చలిగాలులు సిక్కోలు ప్రజలను వనికిస్తున్నాయి. జిల్లాలోని శ్రీకాకుళం, ఆమదాలవలస, సరుబుజ్జిలి,గార , ఇచ్ఛాపురం ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడి పోతుండడం తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సముద్రతీర ప్రాంతాల్లో చలితీవ్రత మరింత అధికంగా కనిపిస్తుంది.