అయాన్ ముఖర్జి దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా.. సెప్టెంబరు 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురాబోతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘బ్రహ్మాస్త్రం: మొదటి భాగం శివ’ పేరుతో విడుదల చేయనున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్గా ఎన్టీఆర్ చీప్ గెస్ట్‌గా బిగ్ ఈవెంట్ ప్లాన్ చేయగా.. రద్దైన సంగతి తెలిసిందే. అయినా రాజమౌళి బ్రహ్మాస్త్ర పై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో ట్రైలర్లో లేని, సినిమాలో కీలకమైన సన్నివేశాలకు సంబంధించిన గ్లింప్స్‌ను చూపించారు. అలాగే బ్రహ్మాస్త్ర అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయినట్టు ఈ ప్రోమో ద్వారా తెలిపారు.
దాంతో బ్రహ్మాస్త్ర బుకింగ్స్‌కు భారీ రెస్పాన్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్లో బాయ్ కాట్ బ్యాచ్.. అన్ని సినిమాలను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బ్రహ్మాస్త్ర పై బాయ్ కాట్ ట్రెండింగ్‌లో ఉంది. దాంతో ఈ ఎఫెక్ట్ అంతకు ముందొచ్చిన బాలీవుడ్ సినిమాలపై పడ్డట్టుగానే.. దీనిపై కూడా పడనుందనే భయం బ్రహ్మాస్త్ర టీమ్‌లో ఉంది. అయితే ఇప్పుడు వీటన్నింటికీ ‘బ్రహ్మాస్త్ర’ చెక్ పెట్టేలాగే కనిపిస్తోంది. నార్త్‌లో ఈ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నట్టు సమాచారం. రోజు రోజుకి బుకింగ్స్ పెరుగుతున్నట్టు టాక్. ఏ మాత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నా.. బాయ్ కాట్ బ్యాచ్ తోక ముడుచుకోవడం పక్కా అంటున్నారు. ఇక సౌత్ రాష్ట్రాల్లోను ‘బ్రహ్మాస్త్ర’ బుకింగ్స్ మంచి రెస్పాన్స్ వస్తోందట. అయితే దీనంతటికి రాజమౌళినే కారణమని చెప్పొచ్చు.