ఆలమూరు పోలీస్ స్టేషన్‌ను అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను ఆయన పరిశీలించారు. అదే విధంగా పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను ఎస్సై నరేష్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు.