GDWL: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలోని బస్తీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.