TG: మంత్రి దామోదర రాజనర్సింహాకు చేదు అనుభవం ఎదురైంది. శాసనమండలి కొత్త భవనంలోకి వెళ్తున్న మంత్రిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ‘ఇది సీఎం వెళ్లే దారి అని మీరు వేరే వైపు నుంచి వెళ్లాలని మంత్రికి సెక్యూరిటీ సిబ్బంది సూచించారు. దీంతో ఎలా వెళ్ళాలి? నేను మినిస్టర్ను నన్ను ఆపుతావా’ అంటూ సెక్యూరిటీ సిబ్బందిపై దామోదర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి మండలి లోపలికి వెళ్లారు.