KMR: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఎన్నికల హామీలను అమలు చేయడంలేదని బీజేపీ మాచారెడ్డి మండల అధ్యక్షుడు బుస సురేశ్ విమర్శించారు. సోమవారం మండల రెవెన్యూ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. వృద్ధాప్య, వితంతు పెన్షన్లు, నిరుద్యోగ భృతి, రైతు భరోసా పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.