సత్యసాయి: జిల్లాలో భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా చేపట్టిన ‘మన పల్లె-మన నీరు’ పనుల కోసం కొత్త జేసీబీ యంత్రాన్ని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ప్రారంభించారు. వర్షాకాలం లోపు జిల్లాలోని చెరువులు, సప్లై ఛానళ్లలో పూడికతీత పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నీటి నిల్వ సామర్థ్యం పెంచేందుకు కంప చెట్లను తొలగించి, పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.