E.G: రాజమండ్రిలోని క్వారీ మార్కెట్ జంక్షన్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను నగర కమిషనర్ రాహుల్ మీనా ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు ఆహారం నాణ్యత, రుచిపై అక్కడికి వచ్చిన వారిని అడిగి తెలుసుకున్నారు. పేదల కోసం ప్రభుత్వం రూ.5కే పోషకాలతో కూడిన భోజనం అందిస్తోందని, నాణ్యతలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని సిబ్బందిని ఆదేశించారు.