Jayaprakash Narayana: ఓఆర్ఆర్ మెట్రోపై లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ (Jayaprakash Narayana) హాట్ కామెంట్స్ చేశారు. అదీ మరో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవుతుందని ధ్వజమెత్తారు. ట్రాఫిక్ లేని ఓఆర్ఆర్ రూట్లో మెట్రో నిర్మించడాన్ని ఆయన వ్యతిరేకించారు. ప్రజల కోసం బస్సులు వేస్తే సునాయాసంగా వెళ్లవచ్చని సూచించారు.
100 బస్సులకు మహా అంటే రూ.100 కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. అదే మెట్రోకు భారీ వ్యయం అవుతుందని.. ప్రభుత్వం ఆ ఆలోచన విరమించుకోవాలని కోరారు. మెట్రోకు కిలోమీటర్‌కు రూ.200 నుంచి రూ.300 కోట్ల వరకు ఖర్చు అవుతుందని లెక్కలతో సహా వివరించారు. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం మరిన్ని అప్పుల బారిన పడటం అవసరమా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మెట్రో ప్రాజెక్ట్ గురించి ప్రకటన చేసింది. అందుకోసం జయప్రకాశ్ నారాయణ స్పందించారు.