VZM: బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన బుర్రకథ కళాకారుడు పిరిడి జగన్నాథంకు గజపతి నగరానికి చెందిన చైతన్య భారతి సాంస్కృతిక సంస్థ ఉగాది పురస్కారానికి ఎంపిక చేసింది. ఈయన 40 ఏళ్లుగా బుర్రకథకు చేస్తున్న సేవలకు గాను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు సంస్థ కార్యదర్శి బొంతల కోటి శంకర్రావు తెలిపారు.