ఏలూరు: బుట్టాయిగూడెం మండలం దొరమామిడి జలాశయంలో ఆదివారం స్నానానికి దిగి ఇద్దరూ మృతి చెందిన విషయం తెలిసిందే. దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన పలువురు గుబ్బల మంగమ్మ ఆలయానికి విచ్చేసి సంతోషంగా గడిపారు. తిరుగు ప్రయాణంలో దొర మామిడి జలాశయానికి వచ్చారు. వీరిలో తుమ్మల నాగరాజు (30), తుమ్మల రమణ (35) స్నానానికి దిగి మృతి చెందారు.