SKLM: గ్రామీణ ప్రాంతాల అమ్మాయిలు క్రీడల్లో రాణించడం సంతోషకరమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. ఆదివారం తన కార్యాలయంలో సతివాడ గ్రామానికి చెందిన పెదలాపు ఆమని జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచిందన్నారు. అనంతరం ఆమెను శాలువతో సత్కరించి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.