IND vs WI 2nd ODI: వెస్టిండీస్ చేతిలో ఘోరంగా ఓడిన టీమిండియా
వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. మొదటి మ్యాచ్ దిగ్విజయంగా గెలిచిన భారత్ రెండో వన్డేలో తడబడింది. స్వల్ప స్కోరుకు మాత్రమే పరిమితమైంది. దీంతో వెస్టిండీస్ జట్టు అలవోకగా గెలిచింది.
టీమిండియా(Team India)కు వెస్టిండీస్ జట్టు గట్టి షాకిచ్చింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా రెండో వన్డే శనివారం రాత్రి జరిగింది. తొలి వన్డేలో వెస్టిండీస్(Westindies) జట్టును ఓడించిన భారత్ రెండో వన్డేలో బోల్తాపడింది. విండీస్ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లు తడపబడ్డారు. కేవలం 181 పరుగులకే భారత జట్టు ఆలౌట్ అయ్యింది. భారత ఓపెనర్లు ఇషాన్ కిషన్ (55), శుభ్మన్ గిల్ (34) మినహా మిగిలిన బ్యాటర్లు అంతగా ఆడలేదు. ఆ తరువాత బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ జట్టు కేవలం 182 పరుగుల టార్గెట్ను 36.4 ఓవర్లలో పూర్తి చేసింది.
మ్యాచ్లో భాగంగా మొదట టాస్ ఓడిన టీమిండియా(Team India) బ్యాటింగ్కు చేపట్టింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు రెస్ట్ ఇచ్చారు. హార్ధిక పాండ్య కెప్టెన్గా వ్యవహరించిన ఈ మ్యాచ్లో ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ పర్వాలేదనిపించారు. ఆ తర్వాత 91 పరుగుల వ్యవధిలోనే భారత్ జట్టు ఓ వికెట్ కోల్పోయింది. 113 పరుగుల వద్ద ఐదు వికెట్లను భారత జట్టు కోల్పోయింది. వర్షం వల్ల మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది.
కొద్దిసేపటికే మ్యాచ్ తిరిగి ప్రారంభమైనా అక్షర్ పటేల్ (1), సంజు శాంసన్ (9), కెప్టెన్ హార్ధిక్ పాండ్య (7), జడేజా (10), సూర్యకుమార్ (24), శార్దూల్ ఠాకూర్ (16) ఇలా తక్కువ స్కోర్ కే ఔట్ అయ్యి వెనుతిరిగారు. దీంతో టీమిండియా(Team India) స్కోర్ 40.5 ఓవర్లకు 181 పరుగులకే ఆలౌట్ అయింది. విండీస్ బౌలర్లలో మోదీ, షెఫర్డ్ చెరో మూడు వికెట్లు, జోషెఫ్ రెండు వికెట్లు, సీల్స్, కరియా ఒక్కో వికెట్ తీశారు. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ ఆటగాళ్లు 36.4 ఓవర్లలోనే పూర్తి చేశారు. మూడు వన్డేల సిరీస్లో ఇరు జట్లు 1-1 పాయింట్లతో సమ ఉజ్జీలుగా ఉన్నారు. మూడో వన్డే మ్యాచ్లోనే అసలు విజేత ఎవ్వరో తేలనుంది. ఈ మ్యాచ్ ఆగస్టు 1న మంగళవారం జరగనుంది.