సత్యసాయి: పుట్టపర్తి మున్సిపాలిటీకి చెందిన మాజీ ZPTC చెన్నకేశవులు సతీమణి సుబ్బమ్మ ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి వెంటనే వారి నివాసానికి చేరుకుని భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.