పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘బ్రో : ది అవతార్’ (BRO) మూవీ ఈరోజు గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కలిసి నటించారు. తమిళ చిత్రం ‘వినోదయ సీతమ్(Vinodya Seetham)’కు రీమేక్ గా వచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన ట్వీటర్, ప్రీమియర్ టాక్ అద్భుతంగా ఉంది. దీంతో ఫ్యాన్స్ థియేటర్ల వద్ద రచ్చ చేస్తున్నారు.మొత్తానికి పవన్ కళ్యాణ్ వింటేజ్ యాక్షన్ తో పాటు వన్ మ్యాన్ షోగా థియేటర్లు దద్దరిల్లుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ (Akira Nandan) కూడా థియేటర్ వద్ద సందడి చేశాడు.
హైదరాబాద్ (Hyderabad) లోని సుదర్శన్ థియేటర్ కు అకీరా వచ్చాడు. ఒక ఖరీదైన కారులో థియేటర్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అకీరాను చూసిన పవన్ ఫ్యాన్స్ ఆయనను చుట్టుముట్టారు. అకీరాతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. జూనియర్ పవర్ స్టార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు (Videos) సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నాయి. అకీరా త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ కూడా అకీరా ఆరంగేట్రం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ‘ఓజీ’ సినిమా(Oji’ movie)తోనే ప్రేక్షకులను అలరించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇప్పటికే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో అకీరా ఎంట్రీ ఎలా ఉంటుందనేది చూడాలి.