NRPT: పట్టణంలోని 23, 24వ వార్డుల్లో మార్కెట్ ఛైర్మన్ శివారెడ్డి ఆదివారం పర్యటించారు. వార్డు ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. డ్రైనేజీ, అంతర్గత రోడ్లు, విద్యుత్ సమస్యలు ఉన్నట్లు ప్రజలు తెలిపారు. ప్రజా పాలన–ప్రగతి నివేదిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా పర్యటించినట్లు చెప్పారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.