E.G: అనపర్తి నియోజకవర్గం కరకుదురు రూపురేఖలు మారనున్నాయి. రూ.2 కోట్ల నలభై లక్షలతో అరట్లకట్ట-కరకుదురు & కైకవోలు-కరకుదురు బిటి రోడ్ల నిర్మాణం జరిగింది. రూ.55 లక్షలతో ఆసుపత్రి నిర్మాణం, రూ.10 లక్షలతో వాటర్ ట్యాంకు, రూ.55 లక్షలతో గ్రావెల్ రోడ్లు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అయితే, గతంలో రహదారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.