SDPT: గ్రామ పారిశుధ్య కార్మికులు గ్రామం కోసం చేస్తున్న సేవలు అభినందనీయమని వారు చేస్తున్న సేవలను ఎంత కొనియాడిన తక్కువేనని బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండల కేంద్రం బెజ్జంకిలో పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం నిర్వహించారు.