కృష్ణా: పెనమలూరు(M) కానూరు పరిధిలో అక్రమంగా తరలిస్తున్న PDS బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు వివరాల మేరకు.. ఆటోనగర్ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న లారీని తనిఖీ చేయగా 100 క్వింటాళ్ల PDS బియ్యం ఉన్నట్లు గుర్తించారు. లారీ యజమాని, డ్రైవర్ బాలస్వామిని విచారించగా KG రూ.18కు NTR(D)లోని పలు ప్రాంతాల నుంచి ఆటోల ద్వారా బియ్యాన్ని సేకరించినట్లు పోలీసులు చెప్పారు.