కొన్ని చిట్కాలతో బ్లాక్ హెడ్స్ సమస్యను తగ్గించుకోవచ్చు. నిమ్మరసం, తేనె మిశ్రమాన్ని ముక్కుపై రాసి 15 నిమిషాల తర్వాత కడగాలి. బేకింగ్ సోడాను కొద్దిగా నీటిలో కలిపి స్క్రబ్ చేస్తే రంధ్రాల్లో మురికిని తొలగిస్తుంది. వారానికి 2 సార్లు ఆవిరి పడితే మంచిది. మట్టి లేదా చార్కోల్ మాస్క్లు వాడితే నూనె, మురికి పోతాయి. రోజూ పడుకునే ముందు ముఖం కడుక్కోవాలి.