AP: విశాఖ నగరాభివృద్ధికి హడ్కో సహకారం కీలకమని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ‘కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఆదాయ మార్గాలు అన్వేషిస్తాం. విశాఖ మెట్రో ప్రాజెక్టును కేంద్రం పరిశీలిస్తోంది. HYD ORRలా విశాఖకు సెమీ రింగ్ రోడ్ సిద్ధం చేస్తున్నాం. రాంబిల్లి-భోగాపురం ప్రాజెక్టును VMRDA పరిశీలిస్తోంది. మాస్టర్ ప్లాన్ రోడ్డులో ఒక రోడ్డుకు అడ్డంకి ఉంటే పరిష్కరించాం’ అని పేర్కొన్నారు.