NDL: కొత్తపల్లె మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ముగ్గురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం మంజూరైంది. నాగంపల్లికి చెందిన చిన్న మస్తాన్‌కు రూ. 53,641, ఎర్రమఠం గ్రామానికి చెందిన మహేశ్వరయ్యకు రూ. 48,162, నందికుంటకు చెందిన దీపికకు రూ. 41,600 చెక్కులను ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆదివారం అందజేశారు. అనంతరం లబ్ధిదారులు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.