గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదివారం 28వ డివిజన్ ఎన్జీవో కాలనీ 7వ లైన్‌లోని ఎస్‌కేబీఎం స్కూల్‌ను సందర్శించారు. పాఠశాల ఆవరణను పరిశీలించి ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో అవసరమైన సదుపాయాలపై సమాచారం తెలుసుకుని అభివృద్ధి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.