MDCL: అల్వాల్ మచ్చ బొల్లారం డివిజన్ పరిధి సాయిబాబా నగర్ కాలనీలో ఇవాళ కాలనీ అధ్యక్షులు ఐలేని మల్లారెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. కాలనీ సభ్యులు, యువత, మహిళలు కలిసి రహదారులు, పార్కులు, పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని కాలనీ అధ్యక్షులు తెలిపారు.