AP: గ్యాస్ కొరత కారణంగా ద్వారకా తిరుమల శ్రీవారి నిత్యాన్నదానం విభాగంలో కట్టెల పొయ్యిలపై వంటలు ప్రారంభించారు. ప్రస్తుతం రెండు కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేశామని, అవసరం మేరకు స్వామివారి నివేదనశాలలో, ప్రసాదాల తయారీ విభాగంలో, ఉచిత ప్రసాదాలు తయారు చేయడానికి మరికొన్ని ఏర్పాటు చేస్తామని ఈవో తెలిపారు.