»Project K Movie Prabhas Fans Are Buzzing In America
Project K: అమెరికాలో ప్రభాస్ అభిమానుల సందడి!
అగ్రరాజ్యం అమెరికాలో జూలై 20న జరిగే కామిక్ కాన్ ఈవెంట్ కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఈవెంట్లో పాల్గొననున్న మొదటి చిత్రంగా ప్రాజెక్టు కే(Project K) నిలిచింది. ఇప్పటికే ఈ మూవీ హీరో ప్రభాస్(america) సహా పలువురు యూఎస్ చేరుకున్నారు.
ఆదిపురుష్ తర్వాత ప్రభాస్(Prabhas)చేస్తున్న అతి పెద్ద చిత్రం ప్రాజెక్ట్ కె(Project K)…నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వైజయంతి బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఫ్యాన్స్ ఆశలన్నీ ఇప్పుడు ఈ సినిమాపై ఉన్నాయి. ఈ మూవీపై చలా అంచనాలు ఉన్నాయి. కాగా ప్రాజెక్ట్ కె సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన `శాన్ డియాగో కామిక్ కాన్` ఈవెంట్లో పాల్గొననున్నట్లుగా చిత్ర బృదం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అమెరికాలో జరగనున్న `శాన్ డియాగో కామిక్ కాన్` ఈవెంట్లో `ప్రాజెక్ట్ కె` టీమ్ అంతా పాల్గొననుంది. ఈ ఈవెంట్‌కు హాజరుకానున్న తొలి భారతీయ సినిమాగా ప్రాజెక్ట్ కె రికార్డు సృష్టించింది.
ఈ కార్యక్రమం జులై 20వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ అమెరికా(america) చేరుకుంది. ఇప్పటికే ప్రభాస్, కమల్ హసన్ అమెరికా చేరారు. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ కోసం ప్రభాస్ తో పాటు, రానా కూడా అక్కడికి వెళ్లడం విశేషం. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోని తాజాగా వైజయంతి మూవీస్ షేర్ చేసింది. అమెరికాలో ల్యాండ్ అయ్యారు అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇప్పుడు ఈ ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా, ప్రభాస్ హాలీవుడ్ స్టార్ లా ఉన్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుండటం విశేషం.
కాగా, ఈలోగా, ప్రభాస్ అభిమానులు USA లో కార్ల ర్యాలీని చేపట్టారు. వారు రూపొందించిన కార్లతో ప్రాజెక్ట్ K చిత్రాన్ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. కాగా ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ లాంటి వారు నటిస్తుండటం విశేషం. ఇదిలా ఉండగా, ఈ ఈవెంట్ కి దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, దీపిక పదుకునే దీనికి హాజరు కానున్నారు. ఇదే వేదికపై ఈ సినిమా టైటిల్, టీజర్‌ని విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.