»Christopher Nolan Oppenheimer Movie Tickets India Is Rs 2450 What Is So Special
Oppenheimer: ఒక్క సినిమా టికెట్ రూ.2450..ఏంటో స్పెషల్!
క్రిస్టోఫర్ నోలన్(Christopher Nolan) చిత్రాలు అంతా ఈజీగా అర్థం కావు. కథలో క్యారెక్టర్స్ లోని లేయర్స్ తికమక పెడతాయి. ఒక ఫజిల్ లా సాగే కథలో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనే భావన కలుగుతుంది. ఇప్పుడు ఓపెన్‌హైమర్(oppenheimer) అనే మరో మూవీతో మనముందుకు రాబోతున్నారు.
క్రిస్టోఫర్ నోలన్(Christopher Nolan) సినిమా వస్తుదంటే వరల్డ్ వైడ్ బజ్ ఉంటుంది. తన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లడం నోలన్ ప్రత్యేకత. సైన్స్, లాజిక్ ఫాలో అవుతూ సృజనాత్మకంగా సినిమా తెరకెక్కించడంలో నోలన్ ఘటికుడు. ఆయన స్క్రీన్ ప్లే టెక్నీక్స్, కథలు ప్రపంచ వ్యాప్తంగా వందల చిత్రాలకు స్ఫూర్తిగా నిలిచాయి. ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిన బ్లాక్ బస్టర్ గజినీ చిత్రాన్ని క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన మెమెంటో స్ఫూర్తి.
మాస్టర్‌మైండ్ క్రిస్టోఫర్ నోలన్ భారతదేశంలో కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఈ దర్శకుడి ప్రతి కొత్త సినిమాను భారతీయ ప్రేక్షకులు ఆదరిస్తారు. అతని తాజా చిత్రం ఓపెన్‌హైమర్(oppenheimer) జూలై 21న భారతదేశంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్యంగా చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ముందస్తు బుకింగ్‌లు భారీగా పెరుగుతున్నాయి. నోలన్ మునుపటి చిత్రాలు, ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్ భారతదేశంలో బ్లాక్‌బస్టర్స్ అయ్యాయి. ఓపెన్‌హైమర్ ఉదయం, అర్థరాత్రి షోలతో సహా దాదాపు అన్ని ప్రదర్శనలు ప్రధాన నగరాల్లో అమ్ముడయ్యాయి. కాబట్టి ఓపెన్‌హైమర్ మరో హిట్ పక్కా అని తెలుస్తోంది.
నివేదికల ప్రకారం, బుక్ మై షో పోర్టల్‌లో దేశవ్యాప్తంగా(india) ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే 3 లక్షల టిక్కెట్లు(tickets) అమ్ముడయ్యాయి. 12, 4 గంటల షోలకు కూడా అభిమానులు టిక్కెట్లు కొంటున్నారు. ఈ చిత్రానికి అత్యంత ఖరీదైన టిక్కెట్టు రూ.2,450 అని కూడా సమాచారం. బుక్ మై షో వెబ్‌సైట్‌ను పరిశీలిస్తే, ఈ చిత్రానికి సంబంధించిన ఐమాక్స్ టిక్కెట్లు రూ.1500, రూ.2000 చొప్పున విక్రయిస్తుండటం విశేషం. చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలతో పోల్చితే ఢిల్లీ, ముంబైలలో టిక్కట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీలో, 2డి షోల టిక్కెట్లు కూడా ఒక్కొక్కటి రూ.2000 చొప్పున విక్రయిస్తున్నారు. రెండున్నర దశాబ్దాల కెరీర్లో నోలన్ కేవలం 12 చిత్రాలు చేశారు. నోలన్ చిత్రాలు ఒక పట్టాన అర్థం కావు.