»India Media And Entertainment Industry At Rs 68 Lakh Crore In 2027
Media and entertainment: నాలుగేళ్లలో రూ.6 లక్షల కోట్లకు మీడియా, వినోద పరిశ్రమ
దేశంలో వచ్చే నాలుగేళ్లలో మీడియా, వినోద పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుంతుందని PwC గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ & మీడియా ఔట్లుక్ నివేదిక వెల్లడించింది. 2027 నాటికి ఏకంగా 6 లక్షల కోట్లకు చేరుకుంటుందని పేర్కొంది.
ఇండియాలో వచ్చే నాలుగేళ్లలో ఎంటర్టైన్మెంట్ & మీడియా (E&M) పరిశ్రమ దూసుకెళ్తుందని PwC గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ & మీడియా ఔట్లుక్ నివేదిక వెల్లడించింది. 2027 నాటికి ఈ ఇండస్ట్రీ రూ.68,28,944 కోట్లకు (సుమారు US$73.6 బిలియన్లు) చేరుతుందని అంచనా వేసింది. 9.48 శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు (CAGR)తో వృద్ధి చెందుతుందని ఈ నివేదిక తెలిపింది. వినియోగదారుల్లో వస్తున్న మార్పులతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML), మెటావర్స్ వంటి అత్యాధునిక సాంకేతికతల ప్రభావంతో ఈ రంగం మరింత వృద్ధి చెందుతుందని చెప్పింది.
ఇక 2022లో మొత్తం అంతర్జాతీయ వినోద, మీడియా పరిశ్రమ ఆదాయం 2.32 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.190.24 లక్షల కోట్లు)గా నమోదైంది. 2021లో 10.6 శాతం వృద్ధి నమోదు చేసిన ఈ పరిశ్రమ, 2022లో 5.4 శాతానికి పరిమితమైంది. వినియోగదారు వ్యయాలు తగ్గడంతో వృద్ధి తగ్గిందని ఈ మేరకు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో వీక్షకులను మరింత పెంచుకునేందుకు మీడియా కంపెనీలు, కంటెంట్ సృష్టికర్తలు అనేక విధానాలను అవలంబించేలా ప్రోత్సహిస్తారని వెల్లడించారు. ఈ క్రమంలో మీడియా & ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ తమ ప్రేక్షకులకు అనకూలంగా ఉండటానికి భవిష్యత్తు-ఆధారిత, పరివర్తన ఆలోచనలపై గణనీయమైన పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
దేశంలో మీడియా, వినోద పరిశ్రమ వృద్ధి గణనీయంగా ఓవర్-ది-టాప్ (OTT) కంటెంట్ ద్వారా నడపబడుతుంది. నివేదిక ప్రకారం, OTT వీడియో విభాగం విశేషమైన విస్తరణను చూసింది. 2022లో ఆదాయం 25.1 శాతం పెరిగింది. రూ.1.48 లక్షల కోట్లు (US$1.8 బిలియన్లు). ఇది 2018లో నమోదైన ఆదాయం కంటే ఆరు రెట్లు ఎక్కువ. ఇది 2027 నాటికి ఆదాయం రూ. 2.88 లక్షల కోట్లకు (US$3.5 బిలియన్లు) చేరుతుందని అంచనా వేయడంతో ఈ రంగం ఆకట్టుకునే వృద్ధిని కొనసాగిస్తుందని అంచనాలు సూచిస్తున్నాయి.